TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద “ఆదియోగి” విగ్రహం

ద్వారపూడిలో నిర్మాణం.. ఈనెల 26న ప్రారంభం

Trinethram News : ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంద్రా,తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతారు. మహాశివరాత్రి రోజున(ఈనెల 26) ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ఈసా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తు 82 అడుగుల వెడల్పుతో నిర్మించిన విగ్రహం భక్తుల ఆదరణ విశేషంగా పొందుతుంది.ఆ విగ్రహం రూపంలోనే ద్వారపూడిలో బిక్కవోలు మండలం కొమరిపాలెం కు చెందిన శిల్పి పెద్ద రాఘవ బృందం పదినెలలు పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. పూర్తిగా సిమెంట్ తో సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించినట్లు ఆలయ గురుస్వామి ఎస్‌ఎల్ కనకరాజు తెలిపారు.

ఇప్పటికే ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో అరుదైన శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు పదుల సంఖ్యలో ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. భక్తుల ఆదరాభిమానాలు పొందుతున్నాయి. ఇప్పుడు ఈ ఆదియోగి విగ్రహం ద్వారా ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.మండపేట మండలంకు చెందిన ఈ ద్వారపూడి రాజమహేంద్రవరంకు సుమారు 20 కిలోమీటర్లు, అనపర్తికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సామర్లకోట కెనాల్ రోడ్ ను ఆనుకుని ఈ ఆలయం ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adiyogi statue