TRINETHRAM NEWS

రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు!

Trinethram News : Andhra Pradesh : ఉన్నత విద్యామండలికి ఉన్న కొన్ని అధికారాలు తగ్గించి.. కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖలు నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో కొన్నింటిని రద్దు చేసి, కమిషనరేట్కు అప్పగిస్తారు. ఈ ప్రతిపాదనలను కేబినెట్లో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కళాశాలవిద్య, ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారాలతో ఈ కమిషనరేట్ పనిచేస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App