District Collector : విద్యా ప్రమాణాలు పెంచడం పై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు శ్రద్ద పెట్టాలి జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

విద్యా ప్రమాణాలు పెంచడం పై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు శ్రద్ద పెట్టాలి జిల్లా కలెక్టర్

*కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ప్రతిరోజు ఒక పాఠశాలను తనిఖీ చేయాలి, పెద్దపల్లి ,ఓదెల మండలం కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో సమీక్ష నిర్వహించిన, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, జనవరి -31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడం పై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత కలెక్టరేట్ లో 36 కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో ,14 మండలాల మియో లు మరియు పెద్దపల్లి ఓదెల మండలం ప్రాథమిక, ప్రాథమికోన్నత హెడ్మాస్టర్లతో ఎఫ్.ఎల్.ఎన్. మిడ్ లైన్ టెస్ట్ ఫలితాలపై సమీక్ష నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పాఠశాలల సమర్థ నిర్వహణ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల పటిష్ఠ పర్యవేక్షణతోనే సాధ్యమవుతుందని అన్నారు . పాఠశాలల్లో గుణాత్మక విద్య మెరుగుపరచడానికి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణ గురించి కీలకమైన సూచనలు కలెక్టర్ అందించారు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ లలో రాసి, చదివే సామర్థ్యాలను పెంచాలని, గణితం లో కనీస సామర్థ్యం ఉండేలా దృష్టి సారించాలని అన్నారు. కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ప్రతిరోజు ఒక పాఠశాలను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top