TRINETHRAM NEWS

అమెరికాలో ఇక ట్రంప్ పాలన !

ప్రపంచ పెద్దన్నగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు.

వైట్ హౌస్ లోపల జరిగే కార్యక్రమంలో ప్రముఖుల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బైడెన్ నుంచి బాధ్యతలు తీసుకుని అధికారికంగా వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు.

Trinethram News : అమెరికా : ఏ ఇతర అమెరికా అధ్యక్షుడు ప్రమాణం సమయంలో లేనంత టెన్షన్ ఈ సారి ట్రంప్ విషయంలో ఉంది. ఎందుకంటే ఆయన బాధ్యతలు చేపట్టగానే తీసుకుంటానని ప్రకటించిన కొన్ని నిర్ణయాలు ఎంతో మందిని ప్రభావితం చేయనున్నాయి.

అక్రమ వలసదారుల్ని బలవంతంగా వారి వారి సొంత దేశాలకు తరలించాలని నిర్ణయించారు. వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీసాల విషయంలో అనే మార్పులు చేయాలని ఇప్పటికే కసరత్తు చేస్తారు. హెచ్‌వన్ బీ వీసాల విషయంలోనూ ఆయన తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి వీసాలు అతి తక్కువ స్పాన్సర్ చేసేలా కంపెనీలపై పెద్ద ఎత్తున భారం వేసే అవకాశాలు ఉన్నాయి. ఇక తమ దేశంలో చదువుకోవడానికి వచ్చి స్థిరపడాలనుకునేవారికి షాకివ్వాలనుకుంటున్నారు. ఇలా ట్రంప్ పాలనపై అనేక టెన్షన్లు అన్ని వర్గాల్లో ఉన్నాయి.

పొరుగుదేశాలు, మిత్రదేశాలతో ట్రంప్ వ్యవహారం పదవి చేపట్టక ముందే ఘోరంగా ఉంది. వాటిని కొనేస్తాం..కలిపేసుకుంటామని వ్యాఖ్యానిస్తూ వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేశారు. దాంతో వారూ ట్రంప్ ను నానా మాటలంటున్నారు. తాను వస్తే యుద్ధాలుండవని ఆయన హామీ ఇచ్చారు కానీ ట్రంప్ వ్యక్తిత్వం ప్రకారం చూస్తే.. లేనిపోని సమస్యలు తీసుకువస్తాడేమో అని అమెరికన్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏం చేసినా ఇక ట్రంప్ నిర్ణయాలే కాబట్టి.. ప్రపంచంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఎదురు చూస్తూ ఉండాల్సిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App