సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండలంలోని ప్రతాప్ నగర్, డిండి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్ల గడ్డ తండాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు డిటిఎఫ్ నల్గొండ టీం లు కలిసి దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాలుగు కేసులు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అంతేకాక 10 లీటర్ల సారాయి. 60 కేజీల నల్ల బెల్లం, 10 కేజీల పటిక ను స్వాధీనం చేసుకొని, 900 లీటర్లు బెల్లం పానకం డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఈ దాడుల్లో ఎస్సైలు నరసింహ, వీరబాబు, మల్లేష్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App