బేకరీల పైన జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే కల్తీ ఆహారపదార్థాలు అమ్మితే కఠినమైన చర్యలు.బేకిరీలపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. – జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, IPS. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు జిల్లా టాస్క్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, SI ప్రశాంత్ వర్ధన్ మరియు సిబ్బంది వికారాబాద్ పట్టణం లోని కేక్ & బేకర్స్ మరియి ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిధిలలోని బెంగళూరు అయ్యాంగార్ బేకరీలలో దాడులు నిర్వహించి గడువు ముగిసిన, అశుభ్రంగా ఉన్న మరియు సింతటిక్ ఫుడ్ కలర్స్ కలిపినా బేకరీ ఐటమ్స్ పట్టుకొని సిజ్ చేయడం జరిగింది.
కేక్ & బేక్స్ యజమాని మనష్ మరియు ధరూర్ లోని బెంగళూరు అయ్యాంగార్ బేకరీ యజమాని సచిన్ లను అదుపులోకి తీసుకోని ఆయా పోలీస్ స్టేషన్ ల నందు కేసులు నమోదు చేయించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఇట్టి దాడులు నిర్వహించడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.జిల్లాలో ప్రజల ప్రాణాలకు ముప్పు కల్గించే కల్తీ, కెమికల్ కల్పిన ఆహార పదార్థాలు అమ్మిన, వాటిని ప్రోత్సహించిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు బయటి పదార్థాలు కొనే ముందు, తినే ముందు అవి కల్తీవా, ఏదైనా కిమికల్ కలిసిందా అని గ్రహించాలని ఎవరికైనా అనుమానం వస్తే నేరుగా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఆంజనేయులు గారికి సంప్రదించాలని జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App