తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పోలీస్ కేసులు లేవు అని క్లియరెన్స్ నిమిత్తం కొంతమంది తప్పుడు అఫిడవిట్ లు సమర్పించడం జరుగుతుంది కావున అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి ఒక ప్రకటనలో తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని వారు పాస్ పోర్ట్ కోసం, ఉద్యోగ నియామకాల కోసం, బయట దేశాలకు వెళ్లడం కోసం, తదితర కంపెనీ, సంస్థలు, పరిశ్రమలలో పనిచేయడం కోసం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ పీవీకి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పీసీసీ కోసం దరఖాస్తు లు చేసుకొనే వారు కొంతమంది వారిపై గతంలో కేసులు నమోదు కాబడిన కూడా తమపై ఏలాంటి కేసులు లేవని పోలీస్ కేసుల క్లియరెన్స్ నిమిత్తం తప్పుడు అఫిడవిట్ లు సమర్పించడం జరుగుతుంది. రామగుండం కమీషనరేట్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది వారి దరఖాస్తు ఆధారంగా విచారణ చేసినప్పుడు కొంతమంది పై కేసులు నమోదు కాబడినవి అని గుర్తించడం జరిగింది.
గతంలో కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు తప్పుడు అఫిడవిట్ లు ఇచ్చిన సుమారు 20 మందిని స్పెషల్ బ్రాంచ్ వారు గుర్తించడం జరిగింది వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. భవిష్యత్తు లో కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరు తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ హెచ్చరించారు. అఫిడవిట్ నోటరీ చేసే వాళ్ళు కూడా మీ దగ్గరకు అఫిడవిట్ కోసం వచ్చే వాళ్లకు కూడా తప్పుడు సమాచారంతో అఫిడవిట్ సమర్పిస్తే విచారణలో పోలీసు వారు గుర్తించడం ద్వారా కేసులు నమోదు కాబడతాయని తెలియజేయాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App