బొగ్గు గని పెన్షన్ దారుల సమస్యలు పరిష్కరించాలి.
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గని రిటైర్డ్ ఉద్యోగులు మరియు కార్మికుల పెన్షన్ పెంపుదల సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సింగరేణి భవన్ హైదరాబాద్ లో జరుగుతున్న 183 వ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశానికి విచ్చేసిన కోల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సి.ఎం.పి.ఎఫ్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ విక్రమ్ దేవ్ దత్తా కు మరియు ఎఐటియుసి జాతీయ అధ్యక్షులు రామేంద్ర కుమార్, హెచ్.ఎం.ఎస్ నాయకులు రాకేష్ కుమార్, సిఐటియు నాయకులు డి.రామానందన్ బోర్డు ఆఫ్ ట్రస్ట్ సభ్యులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం 1998 నుండి ప్రారంభించిన్నప్పటి నుండి బొగ్గు కార్మికులకు రిటైర్డ్ అయిన రోజు నుంచి ఎంత మంజూరు చేయబడిందో అంతే చెల్లించడం వలన అతి తక్కువ పెన్షన్ తో జీవించలేక పోతున్నారు.పెన్షన్ నిధి బలోపేతం చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి ప్రదమైన జీవితం గడపడానికి వారి అవసరాలకు అనుగుణంగా నెలవారి పెన్షన్ సవరించాలని అధికారులకు,మంత్రులకు,రాజకీయ నాయకులకు వినతి పత్రాలు అనేక వేదికల ద్వారా సమర్పించడం జరిగింది.కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకొనలేదు.
అన్ని పత్రాలు ఆన్ లైన్ కంప్యూటరైజేషన్ చేసిన తరువాత కూడా పెన్షన్ మంజూరు చేయడానికి రెండు మూడు నెలలు ఎదురు చూడవలసి వస్తుంది.దీనికి ఎస్ బి ఐ ధన్ బాద్ లో జరుగుతున్న జాప్యం నివారించాలి. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్, బ్యాంకుల వద్ద ఉన్న ఉద్యోగుల సమాచారం మేరకు సవరించిన పెన్షన్ పే ఆర్దర్లు జారీ చేయాలి.రివైజ్ పెన్షన్ పే ఆర్డర్ పొందినప్పటికి పెన్షన్ పొందటానికి అధికారుల సంతకాల కొరకు వృద్దాప్య వితంతువులు తిరగవలసి వస్తుంది.బ్యాంక్ అధికారులకు తగిన మార్గదర్శక సూత్రాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదని,2024 మార్చి 8 న ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అందరికి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండంరాజు రాంచందర్ రావు, ఉప ప్రధాన కార్యదర్శి ఆళ వందార్ వేణు మాధవ్ లు వారికి ఇచ్చిన వినతి పత్రం లో పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App