TRINETHRAM NEWS

సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు

జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ!

Trinethram News : న్యూ ఢిల్లీ : జనవరి 15
ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు పడింది. భారత నావికా దళం మరింత బలాన్ని పుంజుకుంది. నేవీ అమ్ముల పొదిలోకి అధునాతన యుద్ధనౌకలు చేరాయి. INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాఘ్‌షీర్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌ షీర్‌ను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నేవీ ముంబయి లోని ఖర్ఘర్‌లోని శ్రీశ్రీశ్రీ రాధా మదన్‌మోహన్‌జీ ఆలయా న్ని ఇస్కాన్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.

ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో INS సూరత్‌ ఒకటి. పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ యుద్ధనౌకను అభివృద్ధి చేశారు. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధనౌకలో అధునా తన ఆయుధ-సెన్సర్‌ వ్యవస్థలు ఉన్నాయని నేవీ తెలిపింది.

నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ సామర్థ్యం దీని సొంతం. INS నీలగిరిః P 17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని తయా రుచేశారు. INS వాఘ్‌షీర్: P 75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ సహ కారంతో ఈ యుద్ధనౌకను అభివృద్ధి చేశారు.

భారత నౌకాదళం శక్తిని బలోపేతం చేయడానికి మూడు గొప్ప శక్తులు సిద్ధం అయ్యాయి. ఇది భారతదేశ సముద్ర సరిహద్దును అభేద్యంగా చేస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభం భార త నౌకాదళానికి చారిత్రక ఘట్టాన్ని తీసుకొచ్చింది. ముంబైలోని నేవల్ డాక్‌ యార్డ్‌లో ప్రధాని మోదీ ఈ మూడు అత్యాధునాతన యుద్ధనౌకలు భారత నావికాదళానికి అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… భారతదేశం మొత్తం ప్రపంచంలో ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో నమ్మక మైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందని అన్నారు. భారతదేశం విస్తరణ స్ఫూర్తితో పనిచేయదు, భారతదేశం అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.

మూడు ప్రముఖ నౌకాదళ యుద్ధ నౌకలు భారత దేశంలోనే నిర్మించబడటం గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ.. నేటి భారత్ ప్రపంచంలోనే ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతోం దన్నారు. డిస్ట్రాయర్, ఫ్రిగేట్, జలాంతర్గామి కలిసి పని చేయడం ఇదే తొలిసారి అని ప్రధాని మోదీ అన్నారు.

ఈ మూడూ మేడ్ ఇన్ ఇండియా కావడం గర్విం చదగ్గ విషయం. అతిపెద్ద విషయం ఏమిటంటే, ఈ ఫ్రంట్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులు, కాబట్టి, ఇండియన్ నేవీ, ఇంజనీర్లు, సిబ్బంది మొత్తం దేశాన్ని అభినందించారు ప్రధాని మోదీ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App