TRINETHRAM NEWS

ఐబి కాలనీ క్వాటర్స్ లో ఉండలేకపోతున్నాం పరిష్కారం చూపండి కార్మిక కుటుంబ సభ్యుల ఆవేదన

డ్రైనేజీ పొంగి క్వాటర్లలో నీళ్లు చేరుతున్నాయి, ఎన్నిసార్లు వినతి పత్రం అందించిన పరిష్కారం కాలేదు,

వారం రోజుల్లో పరిష్కరించకపోతే సివిల్ డిపార్ట్మెంట్ ముట్టడిస్తాం రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు స్థానిక ఐబీ కాలనీలో సిఐటియు బృందం పర్యటించింది, ఈ సందర్భంగా కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు మా డ్రైనేజ్ సమస్య పరిష్కారం కాక క్వార్టర్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని, అంటు రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని ఎన్నిసార్లు సివిల్ డిపార్ట్మెంట్ కు వినతిపత్రం అందించి మొరపెట్టుకున్న ఇప్పటివరకు పరిష్కారం కాలేదని మా క్వటర్లలో డ్రైనేజీ నీరు చేరి తిండి తినలేక పస్తులు ఉంటున్న పరిస్థితి ఉందన్నారు, డ్యూటీలు చేసి సేద తీర్చుకోవడానికి కనీసం నిద్రపోవడానికి ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు, తుమ్మల రాజా రెడ్డి గారు మాట్లాడుతూ, కార్మికుల కుటుంబ సభ్యుల కనీస అవసరాలు తీర్చడంలో సివిల్ డిపార్ట్మెంట్ పూర్తి విఫలమైందన్నారు, క్వాటర్స్ స్థానిక సమస్యలపై అనేక సంవత్సరం నుంచి సిఐటియు ఆందోళన చేసినప్పటికీ దున్నపోతుపై వర్షం పడ్డట్టు సింగరేణి యజమాన్యం వ్యవహరిస్తుందని, డ్రైనేజీ సమస్య, మంచినీళ్ల సమస్య, రోడ్ల సమస్య ఏ సమస్య చూసినప్పటికీ కార్మికుల ఆవేదన అర్థం కావట్లేదా అని చెప్పి యజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు, వారం రోజుల్లో పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున జిఎం & సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి మండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, పెండ్లి తిరుపతిరెడ్డి, సానబోయిన సాయి ప్రకాష్, కాలనీ కార్మిక కుటుంబ సభ్యులు 20 మంది వరకు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App