TRINETHRAM NEWS

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ లో ఘనంగా కైట్ ఫెస్టివల్

సంక్రాంతి సందర్బంగా కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మద్దెల దినేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 33వ డివిజన్ లో కైట్స్ ఫెస్టివల్స్‌ను నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ముఖ్య అతిథిగా హాజరై కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారని, డివిజన్ లోని పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో చేరుకుని పతంగులు ఎగురవేసారని, ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలిపటాలను ఎగురవేసారని, వివిధ రకాల పతంగులతో ఆనందంగా పలువురు పాల్గొన్నారని మద్దెల దినేష్ పేర్కొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ముగ్గులు, ఆ తరువాత పతంగులు.

సంక్రాంతి సందర్భంగా యువత ఎంతో ఉత్సాహంగా కైట్స్ ఎగురవేస్తుంటారని, మహిళలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులతో పండుగను జరుపుకోగా పిల్లలు, యువత పతంగులు ఎగురవేస్తూ ఆడి పాడి ఎంజాయ్ చేశారని ఆయన అన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు కలిసి పతంగులు ఎగురవేసి స్వీట్లు పంపింణి చేసుకున్నరన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాస్, ఆకాష్, అభిలాష్, రాజు, మహేష్, సురేష్, సతీష్, శ్రీను, రాజేశ్వర్ రావ్, తో పాటు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App