దారి మల్లుతున్న కందిపప్పు.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండలంలో ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కందిపప్పు, కోడిగుడ్లు దారి మల్లుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
లబ్ధిదారులకు అందించాల్సిన కందిపప్పు వారికి ఇవ్వకుండా కిరాణా షాపుల్లో అమ్మకానికి లభిస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు కోడిగుడ్లు బేకరీలలో అమ్ముకున్నట్లు సమాచారం.
కిరాణా షాపు యజమానులు కిలో కందిపప్పు 50 రూపాయలకు కొన్ని 150 రూపాయలకు అమ్ముతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
సంబంధిత అధికారులు అంగన్వాడి కేంద్రాలపై నిఘా ఉంచి సరుకులు దారిమల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App