కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక 46వ డివిజన్ కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా గోదా దేవి రంగనాయక స్వామి కళ్యాణం కన్నుల పండుగ వేదమంత్రాలు మధ్యన జరిగింది భోగి పండుగను పురస్కరించుకొని సోమవారం భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రధాన పూజారి బూర్ల గణేష్ అయ్యవారి ఆధ్వర్యంలో వేద పండితులు నూతి అంబాదాసు అయ్యగారు కొక్కుల మల్లేష్ ఆడెపు సాయి వకుళాభరణం శ్రీనివాస్ బండారి రాయమల్లు తదితర అయ్యగార్లు వేద పండితుల మధ్య గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం కమనీయం అనే రీతిలో అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా రంగనాథ స్వామి దీవెనలు అందుకొని వారి పిల్లలు కుటుంబాలు వారు నివసిస్తున్న ప్రాంతాలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేవిధంగా గోదా రంగనాథ స్వామి దీవించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దాట్ల జేమ్స్ రెడ్డి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ కార్పొరేషన్ నాయకులు మొలుగూరి మహేష్ గొర్రె నర్సింగరావు భక్తివాసులు ఉప్పరి మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App