పప్పుడువలసలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు.
అల్లూరి జిల్లా అరకులోయ: త్రినేత్రం న్యూస్. జనవరి :14
అరకులోయ మండల పరిధిలో చోంపి పంచాయతీ, పప్పుడు వలస,తదితర గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు మొదలు అయ్యాయి. గ్రామంలోని, యువకులు అంతా కలసి రాత్రి భోగి మంట కోసం కట్టెలు సేకరించి, ఉదయం విధిల్లో భోగి మంటలు వేశారు.సోమవారం ఉదయం నుండి పప్పుడువలస సందడి వాతావరణం నెలకొంది. గ్రామస్తులు వేకువ జామున నిద్రలేచి భోగి మంటలు వేసుకున్నారు. ఇదే తరహా సందడి పలు గ్రామాల్లో గిరిజన గ్రామాలు కుటంబ సమేతంగా జరుపుతున్నారు.కార్యక్రమంలో అరకులోయ మండల కార్మిక నాయకుడు స్వామినాయుడు @కాలి యువత ను ఉద్దేశించి “భోగి”అంటే దకిష్ణయానికి ఆఖరి రోజూ ను భోగి అంటారు అనీ.. పదిమంది కీ మంచిని పంచే వాడు భోగి అనీ, ఎవ్వరికీ ఎమి ఇవ్వకుండా స్వార్థ పూరిత, మనసు కలవారు లోభి ఆని.. అందువల్ల లోభి కన్న భోగిగా ఉండాలి ఆని అన్నారు.. పండుగలో గ్రామస్తులు, పి.శంకర్ రావు, సింహాచలం, ఎస్.నందీశ్వరరావు,ఎస్.రాజు సత్తిబాబు,టి. అప్పలనాయుడు,డి. కొండలరావు,పి.మోహన్ సాయి,ఆర్.వంశీ, డి.చిన్న ,పెద్ద, రోహిత్, రాకేష్, నవదీపు,దిలీప్ వర్ధన్,చంటి, మరియు పిల్లలు అందరూ సంతోషం తొ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App