సతీష్ మరణం పట్ల ఏఐటియుసి సంతాపం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె 11వ ఇంక్లైన్ లో విధులు నిర్వహిస్తున్న గిన్నారపు సతీష్ మరియు వారి కుమారుడు సోమవారం తెల్లవారుజామున గోదావరిఖని లో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం పట్ల ఏఐటియుసి సంతాపం వ్యక్తం చేస్తుందని, అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ సతీష్ కుటుంబ సభ్యులు కోలుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, జి.ఎం.కమిటి మెంబర్ సిద్దమల్ల రాజు, పిట్ సెక్రటరీ నాయిని శంకర్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గొడిశల నరేశ్, నాయకులు చెప్యాల భాస్కర్, తాళ్ళపెళ్లి శ్రీనివాస్, కీర్తి శేఖర్ లు పేర్కొన్నారు సతీష్ మరణం వార్త విని గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ లో సతీష్ మరియు అతని కుమారుడు పార్థివ దేహాలను సందర్శించి వారు నివాళులు అర్పించారు. సతీష్ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App