డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డాక్టర్. రవీందర్ నాయక్ ను ఐ.ఎం.ఏ. హాల్లో కలిసి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు 17, 514 మంది ఉన్నారని వెంటనే ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అలాగే 78 క్యాడర్లకు క్యాడర్ ఫిక్స్ చేసి బేసిక్ వేతనాలు అమలు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డి.హెచ్.) డాక్టర్. రవీందర్ నాయక్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్ ,హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ సౌకర్యం, 180 రోజుల వేతనంతో కూడిన మహిళా ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలని, ఏడు నెలల పి.ఆర్.సీ. ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సంవత్సరానికి 35 క్యాజువల్ న్యూస్ మంజూరు చేయాలని, ఉద్యోగులందరికీ 30% వెయిటేజ్ వర్తింపజేయాలని, తదితర సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల అంజి, వరంగల్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ చీఫ్ అడ్వైజర్ వైకుంఠం, మరియు ఎం. శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App