TRINETHRAM NEWS

బ్రహ్మణపల్లి రైతు వేదికలో కల్యాణ లక్ష్మీ షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

అంతర్గం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

18 లక్షల 18 వేల ,288 విలువగల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపించేసిన ప్రతి ఒక్కరికి తెలిపిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

అంతర్గం మండలంలోని బ్రహ్మణపల్లి రైతు వేదిక లో తహసీల్దార్ ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ మరియు షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఆడ బిడ్డలకు జన్మానించిన కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశ్యం తో కల్యాణ లక్ష్మి & షాద్ ముబారక్ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఒక్క దిక్కు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరో దిక్కు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక నిధులు విడుదల చేస్తున్న రేవంత్ రెడ్డి ధన్యవాదాలు

అంతర్గం మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతున్న తరుణంలో సుమారుగా 80 కోట్ల రూపాయల డాంబర్ రోడ్డు లు వేయానున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రణాళికలు సిద్ధం చేసి బండల వాగు ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేయడం జరిగిన గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి 10 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది

కానీ మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ బండలవాగు ప్రాజెక్టు ను అతి త్వరలోనే
250 కోట్ల రూపాయల నిధులతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా బండల వాగు ప్రాజెక్టు నిర్మాణానికి అంతర్గం మరియు పాలకుర్తి మండల రైతులకు సాగు నీరు ఇవ్వడానికి అతి త్వరలో బండల వాగు ను ప్రారంభించడం జరుగుతుంది

వచ్చే సంవత్సరం లో పాలకుర్తి రిజర్వేయర్ ను కూడా రైతుల కోసం , వారి అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్రం చిత్తశుద్ధితో ఉన్నది అని తెలియజేయడానికి ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రుజువు చేస్తున్నాయి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో అంతర్గం తహసీల్దార్, మార్కెట్ వైస్- చైర్మన్ మడ్డి తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు రెవెన్యూ సిబ్బంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App