TRINETHRAM NEWS

11.01.2025. తాడేపల్లి

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం. ఘన నివాళుర్పించిన పార్టీ నేతలు.

భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు చేసి, పోరాడిన యోధుడు, తెలుగు వీరుడు, రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్న వడ్డే ఓబన్న.. వీరత్వానికి మారుపేరు.
1807 జనవరి 11న జన్మించిన ఓబన్న చిన్న వయసులోనే యోధుడిగా ఎదిగారు. ఓబన్న నేతృత్వంలోని సైన్యంతో 1846 జూలై 10న కోవెలకుంట్ల సబ్‌ ట్రెజరీపై దాడి చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆ తర్వాత మూడు నెలల పాటు, బ్రిటిష్‌ పాలకులతో వీరోచిత పోరాటం చేశారు. అందులో ఓబన్న పాత్ర గణనీయం. ఆ పోరాటంలో నల్లమల అడవిని స్థావరంగా చేసుకున్న నరసింహారెడ్డి, ఓబన్న నాయకత్వంలో దాడులకు వ్యూహరచన చేసేవారు.
చివరకు సంజామల మండలం, గిద్దలూరు గ్రామ సమీపంలోని జగన్నాథకొండ వద్ద బ్రిటిష్‌ పాలకులతో జరిగిన తుది ఘోర యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వడ్డే ఓబన్న వీర మరణం పొందారు.
ఆ ఓబన్న 218వ జయంతి‡సందర్భంగా వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘన నివాళులర్పించి, ఆయన వీరోచిత పోరాటాన్ని స్మరించుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App