తెలంగాణ ప్రజలకు సారీ చెప్పిన నిర్మాత దిల్ రాజు… కారణమిదే!
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక
ఈ ఈవెంట్‌లో తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడిన దిల్ రాజు
తెలంగాణ సమాజాన్ని హేళన చేశారంటూ దిల్ రాజుపై విమర్శలు
తన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Trinethram News : విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రజలకు సారీ చెప్పారు.
“నిజామాబాద్ జిల్లా వాసిగా నా సినిమా ఈవెంట్ అక్కడ చేశా. ఈ వేడుకలో నేను మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడాను. తెలంగాణ వారిని నేను అవమానించానని, హేళన చేశానంటూ నాపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తాను.
మన సంస్కృతి నేపథ్యంలో నేను రూపొందించిన బలగం మూవీని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. అన్నీ రాజకీయ పార్టీలు ఈ చిత్రాన్ని అభినందించాయి. బాన్సువాడలోనే ఫిదా సినిమాను తెరకెక్కించాం. ఆ చిత్రం తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసింది. తెలంగాణ వాసిగా నేను ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను?” అని దిల్ రాజు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App