“గీతా విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు”
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
చొప్పదండి లోని గీతా విద్యాలయంలో ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఇందులో విద్యార్థినీ,విద్యార్థులు హరిదాసు, గోదాదేవి మరియు సోదమ్మల వేషధారణలో వచ్చి అలరించారు. విద్యార్థినీ లు ముగ్గుల పోటీల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గుర్రం ఆనంద రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం అని ప్రతి విద్యార్థి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సంబరాలు నిర్వహించామని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన భోగి మంటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ R.లింగారావు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App