TRINETHRAM NEWS

తేదీ : 10/01/2025.
పీసా చట్టం గురించి చర్చించిన ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు.
కుక్కునూరు : (త్రినేత్ర న్యూస్); విలేఖరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, గణపవరం పంచాయతీ బోనగిరి గ్రామంలో 196 ఓట్లను నమోదు చేయడం జరిగింది. 86 ఓట్లు ఎస్టికి సంబంధించినవి . పీసా చట్టంలో ఎక్కువగా ఎస్టి సభ్యులు హాజరు కావడం విశేషం. అధికారులు ఇచ్చిన సమయంలో ఓటర్లను లెక్కించగా 110 ఉండగా ఓటింగ్ సరిపోదు అని అనడంతో వాయిదా వేశారు.
గ్రామ తాసిల్దారు గోపాల్, యం వి సత్యనారాయణ సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. హాజరైన వారు గణపవరం సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ ఎల్లంకి లక్ష్మణరావు, మండల యం పి పి. జి. రామచంద్రం, గణపవరం టిడిపి గ్రామ అధ్యక్షులు గాడిద. రాంబాబు. వెంకన్న బాబు. కృష్ణ, అర్జున్ రావు, మాజీ మండల కార్యదర్శి గాడిద . నాగేశ్వరరావు సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ బొక్క వీరయ్య, సీనియర్ నాయకులు నల్లజాల వీర వెంకయ్య, అర్థ బాబు, మురళి, బిజెపి మండల ఉపాధ్యక్షుడు వేముల. శేషగిరి పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App