TRINETHRAM NEWS

తేదీ : 10/01/2025..
జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

చాట్రాయి : ( త్రినేత్రం న్యూస్ ) ;
గత 11 సంవత్సరాలు మోడీ పాలనలో కార్మిక వర్గంపై దోపిడి, అనిచివేత చివరి స్థాయికి చేరుకున్నది , ఉద్యోగులను తొలగించడం, వేతనాల కోత, సామాజిక సంరక్షణ, గాలికి వదిలేశారు.
కాంట్రాక్టీకరణ , లే ఆఫ్ లాకౌట్లు , పేదరికం, అసమానతలు పెరుగుతున్నాయి, ,”వికసిత్ భారత్ ” పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దారా దత్తం చేస్తున్నారని, లేబర్ కో డ్లు వలన పారిశ్రామిక సంబంధాలు , యాజమాని బానిస సంబంధాలుగా మారిపోయాయని, మూడు నూతన క్రిమినల్ చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు కలిసి దేశంలో కార్మిక వర్గానికి ఇపత్కరమైన పరిస్థితులు తెచ్చిపెట్టాయి. బుల్డోజర్ పాలనతో పోలీసు రాజ్యం మరింత బలపడి పేదల అనగారిన జీవితాలను అనిచి వేస్తున్నాయి. కార్మిక గొంతు, సంఘాలను భయపెడుతున్నారు. కార్మికుల జీవన వేతనాలు, అర్థవంతమైన సామాజిక సంరక్షణ,జీవన హక్కులు లేకుండా గుంజుకుంటున్నారని, స్కిమ్ వర్కర్స్, పారిశుద్ధ్య, ఉద్యోగ భద్రత కోసం పాత పెన్షన్ విధానాల కొరకు ఉద్యోగులతో ఉద్యమాలు వీధుల్లోకి వస్తున్నాయని, కార్మిక వర్గ హక్కులను తిరిగి సాధించుకోవాలి, ఆత్మగౌరవం, సమానత్వం, సాధన కోసం, పోరాడాలి. లేబర్ కోడ్లును రద్దు చేయాలి, నూతన క్రిమినల్ చట్టాలు , ప్రైవేటీకరణ నిలిపివేత, ఉపాధి, వేతనాలు, గురించి మరియు బడా పెట్టుబడిదారుల ఏజెంట్ పాసిస్ట్ మోడీ పాలన పై పోరాడాలి అని.
ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా, మండలం, గ్రామం లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు భూములకు సంబంధించి న్యాయం చేయాలని, చాట్రాయి మండలంలోని భూమి సర్వే నెంబరు 1/4 ,120 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని పేద ప్రజలు ఆదుకోవాలని సి.పి.ఐ ( యం. యల్ ) రాష్ట్ర కమిటీ సభ్యులు , రాష్ట్ర కార్యదర్శి . డి. హరినాథ్, జిల్లా కార్యదర్శి డి. పుల్లారావు, అఖిలభారత మహిళ అధ్యక్షురాలు పూజిత , సి. బాబురావు . కె. వెంకటేశ్వరరావు , సుందర్ రావు, మారయ్య. చాట్రాయి మండలంలో ఏఐసీసీ టి యు మీటింగ్ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. వచ్చేనెల తేదీ 24,25,26 న ఢిల్లీలో జరిగే 11వ జాతీయ మహాసభలను కార్మిక హక్కు లను తిరిగి సాధించుకోవడానికి ఉద్యమాన్ని తీవ్రతం చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App