TRINETHRAM NEWS

సులభ్ కార్మికులకు పెండింగ్ బోనస్ ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు.

సులభ్ కార్మికులను గుర్తించిన యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తేది 09:01:2024 నాడు సింగరేణి యాజమాన్యం సులబ్ కార్మికులకు కూడా 5000 రూపాయల లాభాల బోనస్ ఇచ్చి సులభ్ కార్మికులను గుర్తించినందుకు గాను సింగరేణి సులభ్ కార్మికుల ఆధ్వర్యంలో ఆర్ జీ వన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, హర్ష మేడం అకౌంట్ సెక్షన్ ఆఫీసర్ డీజీఎం సివిల్ వర ప్రసాద్ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా కార్మిక నాయకులు శనిగల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ తాము చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించి సులభ కార్మికులను గుర్తించి వారికి 5000 రూపాయలు ఇచ్చినందుకు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సింగరేణి యాజమాన్యం సెలబ్ కార్మికులుగా గుర్తించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అదేవిధంగా వీరికి వైద్య సదుపాయం అందించాలని సిఎంపీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. ఇంకా కార్యక్రమంలో ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ గంట శ్రీనివాస్, మనోజ్ కుమార్ మరియు సులబ్ కార్మికులు దామోదర్,రాజయ్య,చంటి,మల్లేశ్వరి,సతీష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App