ఎం.జీ.ఎం.(పి.పి యూనిట్) ను పరిశీలించిన వర్ధన్నపేట డిప్యూటీ డీ.ఎం.అండ్ హెచ్.ఓ.డాక్టర్. మోహన్ సింగ్
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
09 జనవరి 2024
ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీ.పీ.యూనిట్)ను పరిశీలించిన వర్ధన్నపేట డిప్యూటీ డీ.ఎం. అండ్. హెచ్. ఓ. డాక్టర్. మోహన్ సింగ్. ఈ సందర్భంగా డాక్టర్. మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్ ను కోరారు. ముఖ్యంగా అల్ నేషనల్ ప్రోగ్రామ్స్ 100% టార్గెట్ రీచ్ కావాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని, చలి తీవ్రత ఎక్కువగా ఉందని పిల్లలు మరియు వృద్ధులు సాయంత్రం నుంచి ఉదయం వరకు బయట తిరుగడం మంచిది కాదని ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే స్వెటర్ , ఉలన్ దుస్తులు ధరించి బయటికి వెళ్లాలని తగు సూచనలు ఇచ్చారు. ఏ.ఎన్.సి. క్లినిక్ గర్భిణీ స్త్రీలకు చెక్ చేసి ఐరన్, కాల్షియం మందుల పంపిణీ చేసిన ఎం.జి.ఎం. పిపియూనిట్ వైద్యాధికారి డాక్టర్.ఎం.యశస్విని. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నర్మద, రామ రాజేష్ ఖన్నా,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App