జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 08 at 20.09.39

TRINETHRAM NEWS

పి ఆర్ టి యు టి ఎస్ క్యాలండర్ ను ఆవిష్కరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పి ఆర్ టి యు టి ఎస్ కాలమానిని ని రామగుండం నియోజకవర్గం ఎం ఎల్ ఎ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఘనంగా ఆవిష్కరించారు. పి ఆర్ టి యు టి ఎస్ రామగుండం మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలమానిని ఆవిష్కరించి ఉపాధ్యాయుల సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు.స్థానికంగా ఉపాధ్యాయులకు గల సమస్యలన్నీ పరిష్కరించగా గత కొన్ని సంవత్సరాలుగా జరగని బదిలీలు, పదోన్నతులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిందన్నారు. అదే విధంగా 2024 డి ఎస్ సి ద్వారా నూతన ఉపాధ్యాయుల నియామకం చేసిందన్నారు.317 జి ఓ పై కేబినెట్ సబ్ కమిటీ వేసి వెంటనే బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గండు కృష్ణ మూర్తి,రామగుండం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ కుమార్, రఘుబాబు అంతర్గాం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందుల సతీష్ కుమార్, జనార్దన్ రావు, రాష్ట్ర నాయకులు వెంకట లక్ష్మి,రామ లక్ష్మి, అంజన్ కుమార్, రామన్న, దాసరి రఘు,శంకరయ్య, సూర్యనారాయణ, రమేష్,దీటి శ్రీనివాస్, రాచెర్ల శ్రీనివాస్, రమేష్, సత్యనారాయణ, తిరుపతి, నాగరాజు, కిష్టయ్య సృజన తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page