TRINETHRAM NEWS

విద్యార్థులు చిన్నతనం నుండే పోస్టల్ స్టాంప్ లపై అవగాహనా కలిగి ఉండాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
మంగళవారము వికారాబాద్ మునిసిపల్ లోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో పోస్టల్ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజులపాటు జరిగే ప్రత్యేక స్టాంపుల ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజల్వన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జనవరి 7 నుంచి 9వరకు అనంతగిరి ఫెక్స్ పేరిట తపాలా శాఖ ప్రత్యేక స్టాంపుల ప్రదర్శనను నిర్వహిస్తుందని, జిల్లా లో మొట్టమొదటి సారిగా
ఫిలాసఫీ ఎక్స్ బిషన్ మూడు రోజుల పాటు ఏర్పాటు చేయడము జరిగిందని, ఎస్ ఎ రైటింగ్ ,క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగము చేసుకోవాలన్నార.
ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులే, నేను కూడా నిత్య విద్యార్థి మాదిరి తెలుగు, కన్నడ భాషలు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా సంస్కృతం నేర్చుకొన్నాను. సికింద్రాబాద్ డివిజన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్టల్ శాఖ వారి అనంతగిరి పేక్స్ పేరిట కార్యక్రమం ఎన్నో విషయాలు నేర్పిస్తుందని అన్నారు. నా పదవ తరగతిలో వున్నప్పుడు మా పెదనాన్న ఇళ్ళు ఖాళీ చేసే సమయం లో వారి దగ్గర ఒక పుస్తకం చూసి ఆశ్చర్య పోయాను. ఆ పుస్తకం లో దాదాపు 100 స్టాంప్ లు చూసి ఎన్నో విషయాలు అవగాహనా తెచ్చుకోడానికి 30 నుండి 40 రోజుల వరకు సమయం పట్టిందని , నా చిన్నతనంలో సంవత్సరములో రెండు సార్లు పోస్ట్ కార్డు, స్టాంప్ చూసే వాడినని, ఒకటి రక్ష బంధన్, రెండు దసరా పండుగలకు మా బంధువుల నుండి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టల్ కార్డ్స్ వచ్చేవని , అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు అందరు చిన్న తనం నుండే పోష్టల్ స్టాంపుల పై పూర్తి అవగాహనా కలిపించుకోవాలని, అందరు ఇలాంటి కార్యక్రమాలు వీక్షించి, మీతోటి వారికి అందరికి తెలిపి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం అనంతగిరి ఫెక్స్ లోగో తపాలా శాఖ అధికారులతో కలసి ఆవిష్కరణ చేశారు. తదుపరి గత కొంత కాలం నుండి సేకరించి ఏర్పాటు చేసిన ఫిలాసఫీ ఎక్స్ బిషన్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, ఎం బి ప్రసాద్, శ్రినివాష్ పోస్టల్ శాఖ సిబంది , కేశవా రెడ్డి, న్యు గీతాంజలి, మోడల్ స్కూల్ విద్యార్థులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App