బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడిని ఖండించిన ఏటి కృష్ణ.
డిండి( గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
ఏటి. కృష్ణ బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ శాంతిభద్రతలు పరిరక్షించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడో విఫలమయింది.
ఈరోజు బిజెపి కార్యాలయం పై జరిగిన దాడితో విఫలమైన విషయాన్ని స్పష్టంగా ప్రత్యక్షంగా చూస్తున్నా ము.
హోమ్ మినిస్ట్రీ నీ చేతిలో ఉంచుకొని బిజెపి కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో రాళ్లతో, దాడికి పాల్పడుతుంటే ఆనందంగా తిలకిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించకపోవడం చాలా సోషనీయం దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాo.
పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బిజెపి ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడడం దుర్మార్గం.
పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన బిజెపి కార్యకర్తల పైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.
ఇలాంటి దాడులను ఆపకపోతే ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని, భవిష్యత్తులో జరగబోయే పరిణ మాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించడం జరిగింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App