మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్?
23 మంది విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు
తాజాగా కరీంనగర్ పట్టణం శర్మ నగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12గంట లకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మంది ని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు కాగా, రాష్ట్రంలోని గురు కుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరు గుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు
ఈ ఘటన సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App