TRINETHRAM NEWS

రామగుండం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

*2 పంప్ హౌస్ పనులు పూర్తి

*13396ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

*పెండింగ్ చిన్న చిన్న పనులను రెండు వారాలలో పూర్తి చేయాలి

*రామగుండం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

అంతర్గాం, జనవరి -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని, పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష అంతర్గాం మండలం ముర్మూరు గ్రామంలోని రామగుండం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 70 కోట్లతో చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని, పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులను రెండు వారాల లోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

రామగుండం ఎత్తిపోతల పథకం పరిధిలో ముర్మూరు వద్ద ఉన్న పంప్ హౌస్ ద్వారా 12 వేల 146 ఎకరాలు, కుక్కల గూడూర్ వద్ద ఉన్న పంప్ హౌస్ ద్వారా 1250 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, ప్రాజెక్టుకు సంబంధించి మేజర్ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పెండింగ్ పనులు పూర్తయిన వెంటనే మంత్రి సమయం తీసుకొని ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ ఈఈ స్వామి, డీఈ శరత్ బాబు, ఏ ఈ ఈ కార్తీక్ తహసిల్దార్ రవీందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App