తేదీ:06/01/2025.
బొగ్గు మంటున్న రాజకీయం.
కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు చేసిన విషయం ప్రజలకు తెలిసిందే. అది ఏమిటంటే ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని.
ఇది ఇలా ఉండగా నిన్న అనగా తేదీ :05/01/2025 న
అనగా ఆదివారము దీనిపై టిడిపి నాయకులు స్పందించడం జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార మంత్రి వర్గీయులు యార్లగడ్డ తన నియోజకవర్గాన్ని చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ మైనింగ్ చేస్తుంటే ఏ పార్టీ వాళ్ళనైనా వదిలి పెట్టేది లేదని టిడిపి నాయకులు అనడం జరిగింది.
ఎవరి నియోజకవర్గాన్ని వారే అభివృద్ధి చేసుకోవాలి . అంతేగాని వేరొక నియోజకవర్గానికి వెళ్లి అక్కడ రాజకీయాలను రగిలిస్తే బొగ్గు మని బూడిద అయిపోతాయే తప్ప మరి ఏమీ అవదని అన్నారు.
యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయినాడు. అని టిడిపి నాయకులు అనడం జరిగింది.. పార్టీ పరంగా కాకుండా ప్రజలకు సమస్య వస్తే వెంటనే పరిష్కరించి దిశగా ముందుండాలని. తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App