TRINETHRAM NEWS

హీరోగా అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్

Trinethram News : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఆమె గత కొద్ది రోజున నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఆమె గత కొద్ది రోజున నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇటీవలే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో కనిపించింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా విజయవాడలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రేణు దేశాయ్ కొడుకు అకీరా సినీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘ఆ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒక తల్లిగా మీ అందరికంటే ఎక్కువగా నాకే ఆసక్తి ఉంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకీరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి కానీ నేను బలవంతం చేయను. అంత వరకు అందరూ వెయిట్ చేయండి’’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App