మండలంలోని మృతుల కుటుంబాలకు పరామర్శ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు
త్రినేత్రం న్యూస్
ముత్తారం ఆర్ సి
ముత్తారం మండలంలో పలు మృతుల కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆదివారం మచ్చుపేట గ్రామంలో సీనియర్ నాయకుడు దుండే రాజేశం ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, మైదబండ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు బియ్యాని రాజబాబు తండ్రి ఎల్లం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శిచి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి
తెలుసుకున్నారు. మంత్రి వెంట డీసీసీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్ల బాలాజీ, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా, మాజీ సర్పంచులు తుటి రజిత రఫీ, వేల్పురి సంపత్ రావు, సిరికొండ బక్కారావు, తాటిపాముల వకలారాణి శంకర్, యూత్ నాయకుడు బియ్యాని శివకుమార్,జితేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App