అరకువేలిలో రద్దు చేసిన రైల్వే పాసింజర్, రిక్వెస్ట్ స్టాప్ ను కొనసాగించాలి.
అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6 :
ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి, గత్తుం బుజ్జిబాబు మాట్లాడుతూ, అరకువేలి రిక్వెస్ట్ స్టాప్ లో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం నిలుపుతున్న పాజింజర్ గత కొన్ని రోజుల నుండి అరకు వేలి రిక్వెస్ట్ స్టాప్ లో పాసింజర్ నిలుపుదల రద్దు చేయడంతో, ప్రయాణికులు కిలోమీటర్లు దూరం అరకు రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించి, మరల వెనకకు తిరిగి అరకువేలి టౌన్ కు రావాల్సి వస్తుంది. అన్ని రకాల గవర్నమెంట్ ఆఫీస్ లు అలాగే రెస్టారెంట్ లు టూరిస్టులు చూడదగిన గిరిజన మ్యూజియమ్ అరకు వేలి టౌన్ లో ఉండటంతో ఇక్కడ పాసింజర్ రిక్వెస్ట్ స్టాప్ ఉండటంతో, అందరు ప్రయాణికులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేది.
ప్రస్తుతం రిక్వెస్ట్ స్టాప్ రద్దు చేయడం వలన చుట్టూ ప్రక్కల ప్రజాలు మాత్రమే కాకుండా అరకు చూడటానికి వచ్చిన టురిస్టులు కూడ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, అరకు పర్యాటక ప్రాంతనికి విశాఖపట్నం నుండి అరకు పాసింజర్ ద్వారా వచ్చే పర్యాటకులకు ఇది చాలా సౌకర్యంగ ఉంటుంది. కావున ప్రభుత్వం రైల్వే అధికారులు తక్షణమే స్పందించి అరకు వేలి లో గతంలో ఉన్న పాసింజర్ రిక్వెస్ట్ స్టాప్ ను యధావిధిగా కొనసాగించాలి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గెమ్మెల సత్యరావు వి. బుద్ర పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App