ఓసిపి-5 ప్రభావిత ప్రాంతం
33వ డివిజన్ సింగరేణి దత్తత తీసుకొని అభివృధ్ధి చేయాలి
ఓపెన్ కాస్ట్ ల ఓబీలలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని హై కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దిక్కరిస్తున్న ఓబి కంపనిల యాజమాన్యాలు
ప్రభావిత ప్రాంతాలతో పాటు హిందూ శ్మశాన వాటికలో సింగరేణి యాజమాన్యమే ఉచిత దహన సంస్కారాలు నిర్వహించాలి
సింగరేణి సి&ఎండి పేషి లో వినతి పత్రం అందజేసిన మద్దెల దినేష్
త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి
సింగరేణి అర్జి-1 పరిధిలోని గోదావరిఖని ప్రాంతంలోని ఓసిపి -5 ప్రభావిత ప్రాంతం ఆయిన 33వ డివిజన్ సింగరేణి యాజమాన్యమే దత్తత తీసుకొని డివిజన్ అభివృధ్ధి కి పాటుపడాలని, మరియు ఒపెన్ కాస్ట్లకు అనుబంధంగా ఓబీలలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని మరియు సింగరేణి యాజమాన్యమే హిందూ శ్మశాన వాటికలో ఉచిత దహన సంస్కారాలు నిర్వహించాలి అని హైద్రాబాద్ లోని సింగరేణి భవన్ లో సి&ఏండి బలరాం పెషి లో మద్దెల దినేష్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.
అనంతరం ఫైట్ ఫర్ బెటర్ సొసైటి అద్యక్షులు మద్దెల దినేష్ మాట్లాడుతూ ఓసిపి-5 ప్రభావిత ప్రాంతం అయిన 33వ డివిజన్ లో అనేక సమస్యలతో, వివిధ సౌకర్యాలు లేక కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున సంక్షేమం పై దృష్టి సారించాలని, ముఖ్యంగా నూతన రోడ్లు వేయాలని,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీర్చాలని అలాగే సింగరేణి సెక్టార్ -2 కమ్యూనిటీ హాల్ ని మిని బ్యాంకేట్ హాల్ గా మార్చాలని, దాని ముందు గల ఖాళీ స్థలం సింగరేణి పార్క్ ఏర్పాటు చేసి ఒపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ నిర్మించాలని, మరియు బోరింగ్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
ఓపెన్ కాస్ట్ ల అనుబంధంగా ఉన్న ఓబీ కంపెనీలలో స్థానికేతరులు కాకుండా స్థానికులకే 80% ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని మా వంతుగా గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు 80% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసి ఆర్డర్ ఇచ్చిన కానీ వాటిని అమలు చేయడంలో ఓబి కంపెనీల యాజమాన్యాలు మరియు కొంతమంది సింగరేణి అధికారులు పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై వారికి సహకరిస్తూ వారు చెప్పిన వారికే ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని, ఇలానే పునరావృతం అయితే మరల హై కోర్టులో కన్టెప్ట్ వేయడం జరుగుతుందన్నారు.
సింగరేణి యాజమాన్యమే ప్రభావిత ప్రాంతాలలో పాటు హిందూ స్మశానంలో దురదృష్టవశాత్తూ ఎవరైన మృతి చెందితే ఉచితం దహన సంస్కారాలు నిర్వహించాలని సి&ఏం డి గారిని కోరామని దినేష్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App