హైదారాబాద్ హిమాయత్ నగర్ ఏఐటీయుసీ రాష్ట్ర కార్యాలయం లో నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్
త్రినేత్రం న్యూస్ హైదారాబాద్ ప్రతినిధి
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తేదీ 05-01-2025 ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నదని కావున ప్రతి జిల్లా నుంచి ఐదుగురు చొప్పున హాజరు కాగలరు..
రాష్ట్ర అధ్యక్షులు ఎం. నరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సమావేశానికి ప్రతి జిల్లా నుండి అయిదుగురు చొప్పున తప్పక హాజరు కావలసిందిగా కోరుచున్నాము. ఈ సమావేశంలో ఎన్ హెచ్ ఎం రాష్ట్ర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ 2025 ను ఆవిష్కరించడం జరుగుతుంది.
మనఉద్యోగుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవాల్సినా అవసరం ఉన్నందున అందరూ తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాము.
జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App