TRINETHRAM NEWS

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన సిపి

నిందితులకు శిక్ష పడటం లో కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనది

కన్వెక్షన్ రేట్ పెంచాలి పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,

త్రినేత్రం న్యూస్ రామగుండము ప్రతినిధి

కోర్టు డ్యూటీ ఆఫీసర్ లు నేరస్థులు శిక్షల నుండి తప్పించుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్షలు పడుటకు కృషి చేయాలని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) అన్నారు. రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిదిలోని పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో కమీషనరేట్ లో సిపి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కోర్ట్ లలో అండర్ ట్రయల్ ఖైదీలని జైలు నుండి పోలీసు ఎస్కార్ట్ ద్వారా తగు జాగ్రత్తలు తీసుకొని మరియు జైల్ అథారిటీస్, కోర్టు స్టాఫ్ మరియు సంబధిత అధికారులతో సమన్వయo తో గౌరవ కోర్ట్ లో యందు ప్రవేశపెట్టాలని అదేవిధంగా నేరస్థులకు శిక్ష పడే విధంగా సాక్షలను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగే విధంగా చూడాలని సిపి గారు కోర్టు లైజన్ మరియు కోర్టు డ్యూటీ అధికారులకు సూచించడం జరిగింది. నిందితులకు శిక్షలు పడేటట్లు సాక్షులను మోటివేషన్ చేయాలన్నారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, షెడ్యూల్ ప్రకారం సాక్షులను కోర్టులో హాజరుపర్చాలని సూచించారు. పెండింగ్, పెట్టి కేసులు వెంటనే డిస్పోజల్ చేయాలని, నేరస్తులకు శిక్షలు పడితే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేయాలని, కన్విక్షన్ రేటును పెంచాలని అన్నారు. కోర్టు నందు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలి.

కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు పాటించాలని, కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు.కోర్టులో డిస్పోజలైన కేసులను యాకక్విట్టల్ యాక్షన్ అబటెడ్ అడ్మిషన్ కంప్రమైస్డ్ లోక్ ఆడాలత కన్విక్షన్ పార్టిక్యూలర్స్ , డిశ్చార్జడ్ క్కుషెడ్ విత్డ్రావాల్స్ కా్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లింకు నందు తప్పకుండ అప్లోడ్ చేయవలెను. కోర్టు నందు ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా వుంటుందని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు.

అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్ర్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు , ఎసిపి ప్రతాప్, సురేంద్ర, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ సతీష్, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App