శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య పాఠశాలతో స్మార్ట్ లివింగ్ ప్రోగాంలో భాగంగా “బాలికా సంరక్షణ” అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ప్ర) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుసింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి బాలిక విద్యతో పాటు క్రమశిక్షణ, స్వయం నియంత్రణ, విచక్షణా జ్ఞానం,మానసిక బలం, మంచి అలవాట్లు,ఆలోచనలు, దృఢ సంకల్పం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు వంటివి అలవరుచుకోవాలని అన్నారు.
అదే విధంగా చిన్ననాటి నుండి సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో, దుష్టశక్తుల నుండి తమను తాము రక్షించుటకొరకై అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను సంప్రదించాలని తెలిపారు. లింగవివక్షను వీడి అందరు సమానమే అనే భావనతో మెలగాలని అన్నారు. అనంతరం విద్యార్థులు కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ రవి, ఉదయ్ కుమార్, డీన్ రమేష్, క్యాంపస్ ఇంచార్జ్ నరేంద్ర కుమార్, ప్రశాంతి,సౌజన్య,స్వర్ణలత విద్యార్థులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App