TRINETHRAM NEWS

తేదీ :04/01/2025
ఆర్జీలను పరిశీలిస్తున్న మండల తాసిల్దారు.
తిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, తాత కుంట్ల గ్రామ సచివాలయంలో రెవెన్యూ రైతు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల అర్జీలను తీసుకొని భూమికి సంబంధించిన సమస్యలను తగు వివరణతో పూరించడం జరిగింది ఆర్జీ పత్రాలను రెవెన్యూ బృందానికి ఇవ్వగా వెంటనే ఆర్జీ పత్రాలను పరిశీలించి మీ భూమి – మీ హక్కు ద్వారా శాశ్వత పరిష్కారము అవుతుందని భరోసా ఇచ్చారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. తదుపరి అనంతరం సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమినాయకులు, రైతులు, రెవెన్యూ బృందం పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App