TRINETHRAM NEWS

సావిత్రి భాయి పూలే రుణం తీర్చుకోవాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
చదువుల తల్లి సావిత్రి భాయి పూలే 194 జయంతిని పురస్కరించుకుని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని NTR చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్ మహారాజ్ మాట్లాడుతూ భారతీయ అసమానతల సమాజంలో పూలే దంపతులు అనేక అవమానాలు భరించి బడుగు బలహీన వర్గాల విద్య కోసం, స్త్రీ అభ్యున్నతి కోసం మొదటిపాఠశాలను ఏర్పాటు చేసి శూద్ర, అతి శూద్ర జాతులజీవితాలలో వెలుగు నింపిన సామాజిక ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే నేడు స్త్రీ సమాజం,బహుజనసమాజం.చదువుల తల్లి సావిత్రి భాయి పూలే రుణంతీర్చుకోవడానికి, సామాజిక పరివర్తన కోసం బయలుదేరాలని, బహుజనసమాజం మార్పు విద్య ద్వారా మార్పు చెందుతుందని వారుతెలియజేశారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ రవీందర్, మహారాజ్, కో కన్వీనర్లు వెంకటేష్, మల్లికార్జున్, వివిధ మండల నాయకులు వెంకటేష్, రాజు, నర్సింలు, శివ, అశోక్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App