ఆధునిక డిజైన్లలో బట్టలను కుట్టేందుకు నైపుణ్యాభివృద్ధి కోసం మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్థాం..
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ముస్లిం సోదరిమణులకు పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లను ముస్లిం సోదరులతో కలిసి అందించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ముందుగా పెద్దపల్లి ఎడ్యుకేషన్ సొసైటీ వారి శిక్షణ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు.
అనంతరం ఎమ్మెల్యే సొసైటీ వారు, మైనారిటీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన డిజైన్లలో బట్టలను తయారు చేయడం ఎంతో అవసరమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దుస్తులను వివిధ డిజైన్లలో తయారు చేసేందుకు ప్రత్యేక డిజైనర్ ను నియమిస్తానని చెప్పారు. ఇందుకోసం శిక్షణ తీసుకునేందుకు పట్టుదల, ఉత్సాహం మహిళలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప మరియు మున్సిపల్ కౌన్సిలర్లు నూగుళ్ళ మల్లన్న, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్, అమరేష్, సయ్యద్ మస్రథ్ మరియు పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం నాయకులు, ముస్లిం మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App