అబివృద్ధికి ఆమడదూరంలో బిజ్జాగూడ (పీ.వీ.టీ.జి) తెగ
అల్లూరి జిల్లా అరకు లోయ/జనవరి 03.త్రినేత్రం న్యూస్.
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మండల నాయకులు బురిడి దశరథ్ పర్యటన లో వెలుగు చూసిన
బస్కి పంచాయితీ బిజ్జగుడ పివిటిజి గ్రామంలో సమస్యలు.
గ్రామం లో సిసి రోడ్డు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, అంగన్వాడి బిల్డింగ్ విద్యుత్ పోల్స్, వీధి లైట్లులేక, అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో విద్యుత్ పోల్స్ పదిపోల్స్ అవసరమైఉంధి.కానీ ఒక్కటి కూడా మంజూరు చేయడంలేధు.అందువల్ల గ్రామస్తులు చీకట్లో మగ్గుతున్నారు.సిసి రోడ్డు 300 మీటర్ అవసరం ఉంది .డ్రైనేజీ 250 మీటర్ అవసరం ఉంది. అంగన్వాడి బిల్డింగ్ లేక అద్దె భవనంలో సెంటర్ నిర్వహిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు 7 కుటుంబాలకు లేదు. జాబ్ కార్డు ఇద్దరు అర్హులు ఉన్నప్పటికీ, వారికి లేదు. మంచినీరు ట్యాంక్ రిపేర్ చేయాలి, ఇటువంటి సమస్యలతో బిజ్జాగూడ, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.
కుంతరయిగూడ, కుర్రగూడ, కంజేరితోట వరకూ గ్రాములకు ఇదే పరిస్థితి.
పంచాయతీలో సిసి రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మలేరియా, డయేరియా, వంటి సమస్యలకు నిత్యం ఎదుర్కొంటున్నారు.
అభివృద్ధికి దూరంగా ఉన్న బస్కి పంచాయతీలో ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో చౌడేపల్లి ఆనందరావు దేవన్న సుబ్బారావు, సత్యారావు, రామచందర్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App