TRINETHRAM NEWS

రామం-రావణం సినిమా అంకురార్పణం.

ఏలూరులో టైటిల్ ప్రకటించిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్

దాసరి సారధి డైరెక్టర్ గా, కావూరి లావణ్య నిర్మాతగా కధ సిద్ధం.

వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణానికి సన్నాహాలు.

త్వరలో సెట్స్ మీదకు రామం-రావణం సినిమా.

Trinethram News : ఏలూరు, జనవరి 01:
సనాతన ధర్మాన్ని పరిరక్షణకు ప్రతీ హిందువూ సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘటితం జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్ పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరు దొండపాడులోని బాబా శివ అఘోరీజీ పీఠం నందు రామం-రావణం సినిమా పేరును శ్రీశ్రీశ్రీ శివ అఘోరీజీ ప్రారంభించారు. ఈసందర్భంగా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ భారతదేశం హిందూ దేశమని, భారతీయులందరూ హిందువులేనని, పాచ్యాత్యదేశ పోకడలతో మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతీ హిందువూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసేలా రామం-రావణం చిత్ర నిర్మాణం చేపట్టడం హర్షణీయమని శ్రీ శ్రీ శ్రీ బాబా శివ అఘోరి నిర్మాత కావూరి లావణ్య ను అభినందించారు. తెలుగువారిగా రామం-రావణం సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గొప్పతన్నాన్ని తెలియజేయుటకు నాంధి పలకటం శుభపరిణామని పేర్కొన్నారు. వేదాలలో నిఘూడంగా ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీసి సనాతన ధర్మం యొక్క గొప్ప తనాన్ని చాటిచెప్పే తొలి ప్రయత్నంలో భాగంగా భారతీయ చలన చరిత్రలో మునుపెన్నడూ చూడనటువంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వంద కోట్ల భారీ బడ్జెట్ తో రామం-రావణం సినిమా నిర్మిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు, నిర్మాత, కావూరి లావణ్య తెలిపారు. ఇదిలా ఉండగా రామం-రావణం సినిమాకు దర్శకుడిగా విజయవాడకు చెందిన ప్రముఖ దర్శకుడు దాసరి సారధి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే కధ సిద్ధం చేసుకోగా నటీ నటులు ఎంపిక కూడా 90 శాతం పూర్తయింది. త్వరలో ఈ సినిమాను సెట్ట్స్ మీదకు తీసుకువెళ్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు కావూరి లావణ్య తెలుగు ప్రజలకు ఇంగ్లీషు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App