TRINETHRAM NEWS

క్రమశిక్షణకు మారుపేరు కరాటే విద్యార్థులు: జిఎం లలిత్ కుమార్

జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఖని విద్యార్థుల హావా…!

కరాటే శిక్షణ.. ఉన్నత స్థానానికి నాంది: జిఎం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024_25 కుంగ్ ఫూ కరాటే పోటీలు బెల్లంపల్లిలో ఆదిలాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆర్గనైజర్ పిన్నింటి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలలో గోదావరిఖని తో పాటు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక నుండి కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందులో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి హూయాన్-చుంగ్-కుంగ్-ఫూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఎం రాజేశం ఆధ్వర్యంలో ఐదుగురు విద్యార్థులు పాల్గొన్నారు. కె నిహారిక, డి కార్తికేయ, కె సాయి కౌషిక్ లు గోల్డ్ మెడల్ సాధించారు.
ఎండి గౌస్ సిల్వర్ మెడల్, డి సంజీవ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. మంగళవారం రామగుండం1 ఏరియా జిఎం టి లలిత్ కుమార్ విద్యార్థులను అభినందించి మెడల్స్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాస్టర్లు ఎం రాజేశం, కె రాములు, విద్యార్థిని విద్యార్థులను, తల్లిదండ్రులను జిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు ఆరెల్లి పోషం, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App