జనవరి మూడు నుండి భారత్ ఆదివాసి పార్టీ సభ్యత్వాలు స్వీకరణ – మొట్టడం రాజబాబు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : జైపాల్ సింగ్ ముండా జయంతి నుండి, పార్టీ సభ్యత్వాలు నమోదు ప్రారంభం: ఆదివాసీ పార్టీ
భారత రాజ్యాంగంలో 5,6 వ షెడ్యూల్స్ రూప శిల్పి జైపాల్ సింగ్ ముండా జయంతి(జనవరి-03)నుండి భారత్ ఆదివాసీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పార్టీ సభ్యత్వాలు స్వీకరించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మొట్టడం రాజబాబు తెలిపారు.జల్,జంగల్,జమీన్ (పర్యావరణం) రక్షించే పార్టీ భారత్ ఆదివాసీ పార్టీ అని, భారతదేశంలోని సాధారణ పౌరుల జీవితాన్ని సరళంగా మరియు సుసంపన్నంగా మార్చడం,దేశంలోని నీటిని, అడవిని,భూమిని రక్షించే పని ఏ ఒక్క పార్టీ చేయడంలేదు.
కొండలను,నదులను, అడవులను నాశనం చేసే పనిని అన్ని పార్టీలు చేస్తున్నాయని, దేశ పర్యావరణం,సమైక్యత, సమగ్రత,రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం నైతిక విలువలతో రాజకీయాల్లోకి వచ్చామని, ఈ మహాత్తర కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని,జనవరి 3, 2025 తేదీన శుక్రవారం పాడేరు ఆదివాసీ భవన్ లో భారత్ ఆదివాసి పార్టీ సభ్యత్వాల స్వీకరణ,నమోదు ప్రక్రియ ప్రారంభమౌతుందని, ఆదివాసీ సమాజ హితం కోరేవారందరూ పది రూపాయలు చెల్లించి భారత్ ఆదివాసీ పార్టీ సభ్యత్వం స్వీకరించాలని ఆయన కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App