TRINETHRAM NEWS

శుక్రవారం విద్యుత్ చార్జీలు పెంపు కూ నిరసనగా వైసిపి చేపట్టిన ధర్నాకు కౌంటర్ ఇచ్చిన అరకు లోయ ఇన్చార్జి & దొన్ను దోర!

అరకు లోయ/డిసెంబర్ 31:త్రినేత్రం స్టాఫ్ రిపోర్టర్.

గత వైసిపి ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను బ్రష్టు పట్టించి మరల కూటమిప్రభుత్వం నీకి వ్యతిరేకంగా ధర్నా లా అనీ వైసిపి పార్టీ పై విరుచుకుపడ్డ అరకు వ్యాలీ నియోజకవర్గ ఇంచార్జి దొన్ను దొర. ఆర్టీసీ విజయనగరం రీజనల్ ఛైర్మెన్ దొన్ను దొర
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను పెంచిన విద్యుత్ చార్జీల మీద తన పార్టీ నాయకులతో తానే ధర్నా చేయించడం దుర్మార్గం..ఆనీ ఐదేళ్లలో అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేసి.
ప్రజల సొమ్మును అప్పనంగా తన వారికి దోచి పెట్టేందుకు జగన్ రెడ్డి విద్యుత్ లోటును సృష్టించారు. పీపీఏలను రద్దు చేయడంతో, సోలార్, విండి పెట్టుబడిదారులను బెదిరించి వారిని రాష్ట్ర0 నుంచి వెళ్లగొట్టారు. దీంతో రాష్ట్రం 10 వేల మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ను కోల్పోయింది. ప్రజల విద్యుత్ అవసరాలు అనే వీరు చెప్పి జగన్ మోహన్ రెడ్డి విచ్చల విడిగా అస్మదీయుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసే విద్యుత్ రంగాన్ని నాశనానికి పునాది వేశారు.
అధికారంలో ఉన్నప్పుడు జగస్ రెడ్డి చేసిన పాపాలే ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారనున్నాయి. ఇప్పుడు పేంచినట్రూప్ అప్ చార్జీలు జగస్ మోహన్ రెడ్డి హయాంలో పెంచి నవి. వారి హయాంలో పెంచాల్సిన చార్జీలపై జగన్ రెడ్డి అండ్ కో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది.
చార్జీల పెంచిన ఘనుడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి హయాంలో మొత్తంగా 10 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా 15 శాతం విద్యుత్ వార్జీలు పెంచిన ఘనుడు జగస్ రెడ్డి . మొత్తం మీద గత ఐదేళ్ల కాలంలో 1,29,000 కోట్ల విద్యుత్ చార్జీల భారం ప్రజలపై జగన్ రెడ్డి వేశారని తిరిగి ఇప్పుడు ధర్నాలు చేయడం ఏమిటని దుయ్యబట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App