కొత్త బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
పరిగి ఆర్టీసీ బస్టాండ్ లో 4 నూతన బస్సులను డిసిసి అధ్యక్షులు,పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.పరిగి-షాద్నగర్,పరిగి-కోస్గి, పరిగి-మహబూబ్నగర్,పరిగి-నవాబ్ పెట్ వరకు బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ.ఆర్టీసీ బస్సుప్రయాణం సురక్షితం, సుఖమయం, అనిఅన్నారునూతనంగా ప్రారంభించిన బస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మహిళలలో ఆత్మస్థైర్యాన్ని నింపింది కాంగ్రెస్ పార్టీ,అదేవిధంగా పరిగి డిపో నుండి 29 కోట్ల రూపాయలను మహిళల ఉచిత టికెట్లకు ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించిందని,మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు చేయూత అందిస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము అని ఎమ్మెల్యే TRR తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App