TRINETHRAM NEWS

తేదీ: 29/12/2024.
G V R ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం ) న్యూస్;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం , చాట్రాయి మండలం, చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుత్తా వెంకటేశ్వరరావు ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గుండె నొప్పి, రక్తనాళాలు, శ్వాస కోస, ఉబ్బసం, ధూమపానం, ఊపిరితిత్తుల ఇబ్బందులు, కంటి చూపు, స్త్రీ మరియు మగ పురుషులకు సంబంధించిన అన్ని నొప్పులకు బాధపడే వారికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. చాట్రాయి మండలం లో ఉన్నటువంటి చుట్టుపక్క ల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది.

ప్రతి రోగానికి సంబంధించిన డాక్టర్లు అక్కడికి వచ్చిన పేషెంట్లను క్షుణ్ణంగా చూసి తగిన వైద్యం చేసి రోగాలను తగ్గించేందుకు మేము ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్లు చెప్పడం జరిగింది. క్యాన్సర్ పేషెంట్ల కు వైద్యం మరియు మందులు అందుబాటులోకి వచ్చాయని ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని క్యాన్సర్ కు సంబంధించిన డాక్టర్ చెప్పడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గృహ నిర్మాణ సమాచార శాఖ మాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సెక్రెటరీ అత్తులూరి శ్రీనివాస్, చిన్నంపేట తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు కందుకూరి అప్పారావు, జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ స్కూల్ చైర్మన్ కోరుకొండ ప్రసాద్, మండల ఉమ్మడి కూటమి నాయకులు మరియు రెవిన్యూ , హెల్త్ డిపార్ట్మెంట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

ప్రజలకు ఉచిత వైద్య సేవ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందని ట్రస్ట్ వారు తెలపడం జరిగింది. మణిపాల్ వైద్యశాల వారి సౌజన్యంతో డాక్టర్లందరు రావడం జరిగిందని తెలిపారఉమ్మడి కూటమి ప్రభుత్వానికి పేషెంట్లు మరియు ప్రజలందరూ, ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో ఎవరికైతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారు ఆర్జీలను రాసుకొని గృహ నిర్మాణ శాఖ మంత్రి కి అందించగా ఆ సమస్యలకు పరిష్కారం చేసే దిశగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మీ సమస్యలు తొలగిపోతాయని శ్రీ కొ లుసు పార్థసారథి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App