TRINETHRAM NEWS

కట్టుకున్న భర్త ను కాటికి పంపించిన భార్య.

డిండి, గుండ్లపల్లి, త్రినేత్రం న్యూస్..
డిండి మండలంలోని దేవత్ పల్లి తండాలో జరిగిన రమావత్ కుమార్ సన్నాఫ్ దేశ యొక్క హత్య కేసులో తల్లి అయిన రామా వత్ సుక్కిని ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ కేసు దర్యాప్తు చేసి కుమార్ యొక్క భార్య అయిన రమావత్ లక్ష్మి తను వెలుగు పల్లి తుంగతుర్తి కి చెందిన వంగాల మధు,,,(తాపీ మేస్త్రి) తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని, ఇట్టి అక్రమ సంబంధం కు అడ్డుగా ఉన్నాడని భర్త అయినా కుమారును, అంతమొందించాలని ఉద్దేశంతో అర్ధరాత్రి దాటిన తర్వాత. మృతుడి పొలం యందే భార్య లక్ష్మి, వంగాల మధు, మరియు మధు వెంట వచ్చిన నల్లరపు సాయికిరణ్ (మెహిదీపట్నం) లతో కలిసి భర్త కుమార్ ను గొంతు నులిమి చంపి, చీరతో చెట్టు కు ఉరి వేసినారు.
ఇట్టి కేసు విచారణ డీఎస్పీ గిరిబాబు, దేవరకొండ,) ఆధ్వర్యంలో జరుగగా. నిందితులను అరెస్టు చేయడం జరిగింది. మరియు రిమాండ్కు తరలించ నైనది. ఇట్టి కేసులో నిందితులను త్వరిత గతిన అరెస్టు చేసినందుకు. సీఐ . సురేష్, ఎస్సై రాజు, డిండి పోలీస్ స్టేషన్ మరియు సిబ్బందిని ఎస్పీ. గారు రివార్డు లు ప్రకటించి, అభినందించడం జరిగింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App