చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవు. డీసీపీ భాస్కర్ ఐపిఎస్.,
రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగార్స్ కి కౌన్సిలింగ్ నిర్వహించిన డిసిపి
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ ఐపీఎస్ డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో ఏలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పలకూడదని, ప్రజలను ఇబ్బందులు కలుగవద్దని ముందస్తు చర్యల్లో భాగంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్స్ మరియు ట్రబుల్ మాంగర్స్ పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ…ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రజలు అందరూ జరుపుకోవడం కోసం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీ వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా మీరు మీ కుటుంబ సమేతంగా తమ తమ ఇళ్లలో సంతోషంగా, చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని షీటర్స్, ట్రబుల్ మంగర్ లను డీసీపీ హెచ్చరించారు. వేడుకల వేళ మద్యం సేవించి నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడపడం, ట్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం, దాడులకు, బెదిరింపులకు పాల్పడడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును డీసీపి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏ సి పి ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App