నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్!
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 27
సంధ్య థియేటర్ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది.
ఈ నేపథ్యంలో మరికాసే పట్లో కోర్టుకు రానున్నారు. అయితే ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఆయన లాయర్లు కోర్టు దృష్టికి తీసుకురానున్నారు.
అయితే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్ళవలసి ఉండగా.. ఆన్లైన్ ద్వారా హాజరవుతారని, ఆయన తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. న్యాయ మూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరుకానున్నట్లు తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App